శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని.. సీఐ ప్రసాదరావు తెలిపారు. తహసీల్దార్ రాంబాబు, కమిషనర్ రవి సుధాకర్‌లతో కలిసి పట్టణంలో తెరిచి ఉన్న దుకాణాలను మూయించారు. ఉదయం 11 గంటల తర్వాత షాపులు తెరవకూడదని.. రోడ్ల మీదకు ఎవరూ రాకూడదని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు.
ఆమదాలవలసలో పటిష్టంగా లాక్డౌన్ అమలు - ఆమదాలవలసలో లాక్ డౌన్
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోలుకు, అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు ఉదయం 11 గంటలలోపే వారి పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సీఐ ప్రసాదరావు కోరారు. 11 తర్వాత ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.
శ్రీకాకుళం లాక్ డౌన్