శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో పలు గ్రామాల్లోని మరో 15 రోజుల పాటు లాక్డౌన్ నిబంధనలు కొనసాగిస్తున్నట్లు ప్రత్యేక అధికారి లవరాజు తెలిపారు. మండలంలోని పాతపట్నం, కొరసవాడ, కాగువాడ, గంగువాడ గ్రామాల్లో ఈ నెల 15 నుంచి నిబంధనలు అమలు చేసినట్లు వివరించారు. లాక్డౌన్ విధించినా.. పాజిటివ్ కేసులు తగ్గకపోవటంతో ఆగస్టు 15 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పాతపట్నంలో లాక్డౌన్ పొడిగింపు - పాతపట్నం లాక్డౌన్ తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
![పాతపట్నంలో లాక్డౌన్ పొడిగింపు lock down extend in pathapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8233838-943-8233838-1596120965857.jpg)
పాతపట్నంలో లాక్డౌన్ పొడిగింపు