ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు'​ - ఆమదాలవలసలో సమావేశానికి తమ్మినేని హాజరు

ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో... మహిళా రుణమేళాను సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు.

'సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే నాన్​ బెయిలబుల్​ వారెంటే'​
'సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే నాన్​ బెయిలబుల్​ వారెంటే'​

By

Published : Nov 27, 2019, 8:01 PM IST

'గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు'​

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళా రుణ మేళాను... సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్​ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా నేరవేరుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా... ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామ వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే... వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వారిపై నాన్​ బెయిలబుల్​ వారెంటు జారీ చేయాలని పోలీసులకు సూచించారు. ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మహిళలకు రుణాలు పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details