ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇతర రాష్ట్రాల నుంచి జోరుగా మద్యం తరలింపు... ఆరుగురు అరెస్ట్ - illegal liquor seized in sarikakulam

రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. కొంతమంది నాటుసారాను తయారీ చేసి అమ్ముతున్నారు. లాభాల కోసం ఒడిశా, తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. పలుచోట్ల పోలీసులు భారీ మెుత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో భారీగా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయాలు... నలుగురు అరెస్ట్
రాష్ట్రంలో భారీగా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయాలు... నలుగురు అరెస్ట్

By

Published : Jul 31, 2020, 8:38 PM IST


శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు ఒడిశా రాష్ట్రం గొసాని నుంచి శ్రీకాకుళం తరలిస్తున్న రూ.80 వేల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. టెక్కలి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేస్తుండగా.. ఓ కారు యూ టర్న్ తీసుకుని వెనక్కి వెళ్లిపోవడాన్ని పోలీసులు గుర్తించి వెంబడించారు. నర్సింగపల్లి గ్రామం వద్ద వాహనాన్ని నిలిపి పరిశీలించగా 84 మద్యం సీసాలు లభ్యమయ్యాయి.

రాష్ట్రంలో భారీగా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయాలు... నలుగురు అరెస్ట్

కారులో ఉన్న ముగ్గురు నిందితులను, వీరికి ఎస్కార్టుగా ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. ట్రైనీ డీఎస్పీ శ్రీలత, సీఐ నీలయ్య టెక్కలి పోలీస్ స్టేషన్​కు చేరుకుని విచారణ చేపట్టారు. ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా వుండడం, ఒడిశాలో మద్యం రేట్లు తక్కువగా ఉండటం వల్ల అధిక లాభార్జన కోసం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అక్రమంగా బీర్​ అమ్మకాలు ఇద్దరు అరెస్ట్

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దక్షిణమూర్తికాలనీకి చెందిన నీరప్ప, షేశానంద రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి అమ్ముతున్నట్లు సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. అక్రమంగా బీర్లు అమ్ముతున్న వీరితో పాటు 490 బీర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ సాయి ప్రసాద్ తెలిపారు.

నాటుసారా బట్టిలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు

నాటుసారా బట్టీలపై దాడులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లి తండా రాళ్ల కొండ మోటు అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. నాటుసారాను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 1200 వందల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.
నాటుసారా బట్టీలపై దాడులు

ఇవీ చదవండి

మద్యం దొరక్క శానిటైజర్​ సేవించి 13 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details