ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొండలు పేల్చి.. పొలాలు ధ్వంసం చేస్తున్నారు' - lingalal valasa villagers difficulties

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లింగాల వలస గ్రామంలో.. కొండలు పేల్చి సమీపంలోని వ్యవసాయ భూములు ధ్వంసం చేస్తున్నారని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమగ్రంగా సర్వే చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.

lingala villagers difficulties due to queries
లింగాల వలస గ్రామస్థుల కష్టాలు

By

Published : Jun 2, 2020, 10:53 PM IST

కొండలను పేలుస్తూ సమీపంలోని వ్యవసాయ భూములను ధ్వంసం చేస్తున్నారంటూ.. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లింగాల వలస గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. భూగర్భ శాఖ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు.

అధికారుల ఎదుట గ్రామస్థులు తమ అవస్థలు చెప్పుకున్నారు. నిర్ణీత సర్వే నెంబర్లు కాకుండా అదనంగా తమ భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు. సమగ్రంగా సర్వే చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details