లిబియా ఉగ్రచెరలో బందీలుగా ఉండి విడుదలైన యువకులు శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. సంతబొమ్మాళి మండలం సీతానగరానికి చెందిన జోగారావు, దానయ్య, వెంకటరావు అనే ముగ్గురు యువకులు ఉపాధి కోసం ఏడాది కిందట లిబియా వెళ్లారు. వారి వీసా గడువు ముగియడంతో సెప్టెంబర్లో స్వదేశానికి బయలుదేరారు. అదే రోజున లిబియాలోని ట్రిపోలి విమానాశ్రయం చేరువలో అపహరణకు గురయ్యారు.
సొంత జిల్లాకు చేరుకున్న లిబియా ఉగ్రచెర బాధితులు - srikakulam latest news
లిబియాలో ఉగ్రవాదుల చెరనుంచి బయటపడిన ముగ్గురు తెలుగు యువకులు సొంత జిల్లాకు చేరుకున్నారు. సహకరించిన ఎంపీ రామ్మోహన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
సొంత జిల్లాకు చేరుకున్న లిబియా ఉగ్రచెర బాధితులు
యువకుల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికే ప్రయత్నాలు చేశారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విషయం తెలియపరచారు. లిబియాలోని భారత దౌత్యాధికారులు చర్యలు తీసుకుని ముగ్గురిని ఉగ్ర చెర నుంచి విడిపించారు. ప్రస్తుతం యువకులు సొంత జిల్లాకు చేరుకున్నారు. ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:
నిత్య అన్నదానానికి వాహన వితరణ
TAGGED:
libyan to india