ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజ్ఞాన ప్రపంచంలో విద్యార్థులు పోటీ పడాలి: తమ్మినేని సీతారాం - Legislative Speaker Tammineni Sitaram

ప్రస్తుతం ఉన్న విజ్ఞాన ప్రపంచంలో పోటీ పడాలని విద్యార్థులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో నాడు-నేడులో భాగంగా పలు పాఠశాలలను పునఃప్రారంభించారు.

Legislative Speaker Tammineni Sitaram
శాసన సభాపతి తమ్మినేని సీతారాం

By

Published : Sep 4, 2021, 6:27 PM IST

దేశంలోని ఏ పల్లెల్లోనూ ఇంత గొప్పగా పాఠశాల భవనాల నిర్మాణం జరగలేదని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామంలో 'మన బడి నాడు- నేడు'లో భాగంగా నిర్మించిన పాఠశాలను సభాపతి తమ్మినేని ప్రారంభించారు. అంతకుముందు నాడు-నేడులో భాగంగా.. చేపట్టిన పనులు పూర్తి చేసుకున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను పునః ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి పచ్చదనంపై అవగాహన కల్పించారు.

జగన్​ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. దేశంలోని ఏ పల్లెల్లోనూ ఇంత గొప్పగా పాఠశాల భవనాల నిర్మాణం జరగలేదన్నారు. ప్రస్తుతం ఉన్న విజ్ఞాన ప్రపంచంలో పోటీ పడాలని విద్యార్థులకు తమ్మినేని సూచించారు. రాష్ట్రంలో ఆడపిల్లల అక్షరాస్యత శాతం పెరగాలని సూచించారు. చాలామంది ఇంగ్లీష్ మీడియం గురించి విమర్శిస్తున్నారు.. అయితే మీ పిల్లలను ఎక్కడ చదివించారో చెప్పాలని విమర్శకులను ఆయన ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details