- శ్రీకాకుళంలో..
నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా.. శ్రీకాకుళం తెదేపా కార్యాలయం, ఏడు రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. పేదలకు కిలో బియ్యం రెండు రూపాయలు, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు అందించారని కొనియాడారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు.
- టెక్కిలిలో..
శ్రీకాకుళం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతిని నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గంలో ఆయన వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ పార్కులో ఆయన విగ్రహానికి, పాతజాతీయ రహదారిపై కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మట్ట సుందరమ్మ, హనుమంతు రామకృష్ణ పాల్గొన్నారు.
టెక్కలిలోని తెదేపా కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అభిమానులు, కార్యకర్తలు హాజరై రక్తదానం చేశారు. పలువురు మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.
- నరసన్నపేటలో..
మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో నరసన్నపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ప్రపంచ ఖ్యాతి పొందిన ప్రజా నాయకుడని రమణమూర్తి అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
- కోటబొమ్మాళిలో..
కోటబొమ్మాళిలోని ఎన్టీఆర్ - ఎర్రన్న పార్క్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కోటబొమ్మలి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
- ఆమదాలవలసలో..