నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా... శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బురిడి వలస, పెద్దపాలెం గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్లను అందిస్తున్నారని సీతారాం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయా.. అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఒకేసారి 16 మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీతారాం అన్నారు. ప్రతి గ్రామంలో పాల శీతల కేంద్రాల ఏర్పాటుతో మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల నిర్మాణంలో ఉన్న లోటుపాట్లను గమనించి, సంబంధిత అధికారులతో సమీక్షించి దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని అసెంబ్లీ స్పీకర్ అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి మనం ఎల్లవేళలా తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.
వెంకటగిరిలో...