Achenna celebrated Lokesh birthday : తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో అభిమానుల మధ్య నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. లోకేశ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా భరోసా ఇచ్చి మనోధైర్యం కల్పిస్తున్న యువనేత అని కొనియాడారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా, తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా నిలుస్తారని అన్నారు.
Achenna celebrated Lokesh birthday : లోకేశ్ తెదేపా భవిష్యత్ నాయకుడు -అచ్చెన్నాయుడు - నిమ్మాడ లో లోకేష్ పుట్టినరోజు వేడుకలు
Achenna celebrated Lokesh birthday : శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను అచ్చెన్నాయుడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ అని అచ్చెన్న అన్నారు.
నిమ్మాడలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు