శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కోర్టు వద్ద న్యాయవాదులు గురువారం నిరసన తెలిపారు. ఆలిండియా లాయర్ అసోసియేషన్ సభ్యులు బొడ్డేపల్లి మోహన్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా సమయంలో పేద న్యాయవాదులకు ప్రభుత్వం ఇస్తానన్న రూ. 10 వేల ఆర్థిక సహాయం ఇంతవరకు మంజూరు చేయలేదని మోహన్‌రావు మండిపడ్డారు. న్యాయవాదులకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందించాలని కోరారు. లా నేస్తం బకాయిలు తక్షమమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.100 కోట్లు సంక్షేమ నిధి బర్ అసోసియేషన్‌కు జమ చయాలన్నారు. న్యాయస్థానంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు.
ఆమదాలవలస కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన - amadalavalasa mandal latest news
ఆమదాలవలస కోర్టు వద్ద న్యాయవాదులు ఆలిండియా లాయర్ అసోసియేషన్ సభ్యులు బొడ్డేపల్లి మోహన్‌రావు ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.
![ఆమదాలవలస కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన layers protest at amadalavalasa court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7670574-897-7670574-1592528410668.jpg)
కోర్టు ముందు ఆందోళన చేపట్టిన న్యాయవాదులు