శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు... కోర్టు ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. నిమ్మాడ గ్రామంలో న్యాయవాది ఇప్పిలి తాత పై కోటబొమ్మాలి పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా వారు విధులు బహిష్కరించారు. విధి నిర్వహణలో భాగంగా బార్ అధ్యక్షుడు ఇప్పిలి తాత... కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ వెళ్లగా 10 గంటల పాటు అక్రమంగా నిర్బంధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనపై సీఐ, ఎస్ఐలు దురుసుగా వ్యవహరించారని చెప్పారు. ఈ మేరకు పోలీసుల తీరుపై పోలీసు ఉన్నతాధికారులు, హైకోర్టు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్టు న్యాయవాదులు తెలిపారు.
నరసన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా - srikakulam latest updates
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి...ధర్నా చేపట్టారు.
![నరసన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా ధర్నా చేస్తున్న న్యాయవాదులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10457917-78-10457917-1612169229996.jpg)
ధర్నా చేస్తున్న న్యాయవాదులు