ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆడనున్న బతుకు చిత్రం...!

కొవిడ్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్​ పై కేంద్రం మరికోన్ని సడలింపులు ఇచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి విద్యాసంస్ధలు, పాఠశాలలతో పాటు... కంటైన్మెంట్‌ జోన్లు మినహ మిగిలిన ప్రాంతాల్లో... వంద మందితో రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుమతులు లభించాయి. వీటి పైనే ఆధార పడి ఉపాధి పోందుతున్న సిబ్బందికి ఈ వార్త కాస్త ఊరటనిస్తోంది. కొవిడ్ నిబంధనలను అనుసరించి పని చేయవలసిందిగా ప్రభుత్వం ఈ సంస్థలను సూచించింది.

థియేటర్​ల పై కోత్త నిబంధనలుయే
restrictions on theaters

By

Published : Oct 1, 2020, 7:21 PM IST

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా విద్యా సంస్థలు, పాఠశాలలు తెరుచుకోవచ్చని తెలిపింది. వినోదపరంగా సినిమా థియేటర్లు కూడా 50 శాతం సీట్ల సామర్థ్యంతో పునఃప్రారంభించుకోవచ్చని వెల్లడించింది. మార్చి 22న మూతపడిన థియేటర్లు నేటి వరకూ మళ్లీ తెరుచుకోలేదు. జిల్లాలో చిన్నా, పెద్దా అన్నీ కలిపి 139 థియేటర్లు ఉన్నాయి. కేంద్ర ప్రకటనతో వాటిపైనే ఆధారపడి ఉపాధి పొందుతున్న దాదాపు 1400 మంది సిబ్బంది సహా వారి కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.

ఉన్నత విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు అక్టోబర్‌ 15 నుంచి తెరుచుకోవడానికి కేంద్రం అనుమతించింది. అయితే వాటిపై అంతిమ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పాఠశాలలను నవంబర్‌ 5 నుంచి తెరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లాలో బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు ఇప్పటికే పరీక్షల ప్రకటన వెలువడింది. ఆయా సంస్థలు ఎప్పుడు తెరుచుకోవాలో నిర్ణయించుకునే అధికారాన్ని రాష్ట్రాల విద్యా విభాగాలకు వదిలేసింది.

నాయకులకు తీపికబురు...

జనతా కర్ఫ్యూ నుంచి రాజకీయ కార్యక్రమాలు, సమావేశాలకు పూర్తిస్థాయిలో బ్రేక్‌ పడింది. జిల్లాలోని కీలక నాయకులంతా చిన్నపాటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారు. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల వందమందితో రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు కేంద్రం అనుమతివ్వడంతో జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరునెలలుగా నిలిచిపోయిన రాజకీయ కార్యక్రమాలు, సమావేశాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం ఈనెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగనుంది. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి:

బాబ్రీ మసీదు కేసు.. పూర్తి కథనాలు

ABOUT THE AUTHOR

...view details