ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి పేదల ఆధీనంలోని భూములు స్వాధీనం - srikakulam district latest updates

తర్లిపేట గ్రామంలో పేదల అధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యపై గ్రామస్థుల నుంచి నిరసన వ్యక్తమైంది.

land taken by officers in srikakulam district
పేదల ఆధీనంలోని భూములు స్వాధీనం

By

Published : Mar 2, 2020, 7:37 AM IST

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తర్లిపేట గ్రామంలో పేదల ఆధీనంలో ఉన్న భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై గ్రామస్థుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. 65 సెంట్ల విస్తీర్ణంలో గ్రామానికి చెందిన పేదలు కొన్నేళ్లుగా ఫలసాయం వచ్చే చెట్లు పెంచుకుంటున్నారు. ఈ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైన అధికారులు అక్కడున్న చెట్లను బలవంతంగా తొలగించారు. అధికారుల చర్యలతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.

పేదల ఆధీనంలోని భూములు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details