ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాత్రి తాళి కట్టాడు... ఉదయాన్నే పరారయ్యాడు..! - పెళ్లి చేసుకుని పారిపోయిన వరుడు

శ్రీకాకుళం జిల్లాలో బాలికను నమ్మించి మోసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. బాలికను న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ హామీ ఇచ్చారు.

రాత్రి తాళి కట్టి... ఉదయాన్నే పరార్‌!

By

Published : Oct 12, 2019, 4:40 PM IST

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక.. అదే గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ్‌ తనను మోసం చేసాడని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాత్రిపూట పెళ్లి చేసుకొని ఉదయాన్నే పరారయ్యాడని తెలిపింది. తాను ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నానని, నాలుగు నెలలుగా కళాశాలకు వెళ్తుండగా.. వెంటపడి పెళ్లి చేసుకుందామని వేధిస్తుండేవాడని పేర్కొంది. గురువారం రాత్రి తాను తాత ఇంటి వద్ద ఉన్న విషయం తెలుసుకుని పెళ్లి చేసుకుందామని చెప్పి.. గ్రామ సమీపంలోని అమ్మవారి గుడిలో తాళి కట్టాడని చెప్పింది. ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే పరారయ్యాడని తెలిపింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసింది. ఎస్‌ఐ చిన్నమనాయుడు మాట్లాడుతూ.. ఇరు వర్గాలను పిలిచి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details