ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామ గ్రామానా తిరిగి వైకాపా పతనానికి నాంది పలుకుతాం' - Kuna Ravikumar sworn Ceremony at Srikakulam

గ్రామ గ్రామానా తిరిగి వైకాపా పతనానికి నాంది పలుకుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో.. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షునిగా కూన రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

Kuna Ravikumar is a president of Srikakulam Parliamentary Constituency
గ్రామ గ్రామానా తిరిగి వైకాపా పతనానికి నాంది పలుకుతాం

By

Published : Oct 31, 2020, 11:36 PM IST

వైకాపా కార్యాలయాలకు మరో నాలుగు నెలల్లో తాళాలు వేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో.. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షునిగా కూన రవికుమార్​తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా తెదేపా కార్యకర్తలకు ముఖ్యనేతలంతా దిశానిర్ధేశం చేశారు.

గ్రామ గ్రామానా తిరిగి వైకాపా పతనానికి నాంది పలుకుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details