శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌ను అధినేత చంద్రబాబు నియమించారు. ఆయన బుధవారం తన సొంత నియోజకవర్గం పొందూరులో పర్యటించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశం అవుతారని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు.
పొందూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన గుడ్ల మోహన్ రావు ఇటీవల తెదేపా నుంచి వైకాపాకి వెళ్లారు. ఇంతవరకు మోహన్‌రావుకు చెందిన సొంత భవనంలో తెలుగుదేశం పార్టీ కార్యాకలాపాలు నిర్వహించేవారు. మోహన్ రావు పార్టీ మారిన అనంతరం.. కార్యాలయం భవనం వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. భవనం ఖాళీ చేయించే విషయంలో కూన రవికుమార్, మోహన్‌రావుకు సంబంధించిన ఫోన్ సంభాషణ విషయంలో వివాదం నెలకొంది.
కూన రవికుమార్ వలన తనకు ప్రాణహాని ఉందని మోహన్ రావు గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫలితంగా.. పోలీసులు రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. మరలా వివాదం పునరావృతం అవుతుందని భావించిన పోలీసులు పార్టీ కార్యాలయం వద్ద ముందస్తుగా మొహరించారు. ఈ కారణంగా... పొందూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కూన రవికుమార్‌కు ఘన సన్మానం...