శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో వంశధార నిర్వాసితులు నిర్మించుకున్న ఇళ్లను తొలగించడం అన్యాయమని తెలుగుదేశం నేత కూన రవికుమార్ అన్నారు. ఆర్.ఆర్ కాలనీలో పర్యటించిన ఆయన... బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో పట్టాలు మంజూరు చేసిన ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుంటే... ఖాళీ చేయించటం ఏంటని ప్రశ్నించారు.
ఖాళీ స్థలంలో ఇళ్లు కట్టుకున్న పేదలకు అధికారులు నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తెదేపా సర్పంచ్ గెలిచారన్న కక్షతోనే... స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులు కూల్చివేతకు పాల్పడితే అడ్డుకుంటామని హెచ్చరించారు.