ప్రపంచ దేశాలు కరోనా వైరస్ నియంత్రణకు నానాపాట్లు పడుతుంటే.. సీఎం జగన్ మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. వైకాపా సర్కారు కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో నిర్లక్ష్యం ప్రవర్తించిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్దారులకు పింఛన్ ఇవ్వలేని పరిస్థితిని తీసుకువచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి కారణం: కూన రవికుమార్ - వైసీపీపై కూన రవికుమార్ కామెంట్స్
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో ప్రభుత్వం మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు.
![ప్రభుత్వ నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి కారణం: కూన రవికుమార్ kuna ravi kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6636047-985-6636047-1585837799576.jpg)
కూన రవి కుమార్