శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తాళ్లవలస గ్రామంలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతున్న ఇళ్లను తెదేపా నేత కూన రవికుమార్ పరిశీలించారు. గత ప్రభుత్వ హయంలో పేదలను గుర్తించి ప్రోసిడింగ్ పత్రాలు అందించామని.. ఇప్పుడు వారికి కాకుండా వైకాపా కార్యకర్తలకు ఇళ్లను మంజూరు చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పేదలను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేగా తాను ఇళ్లు మంజూరు చేయటంతో అప్పటి మున్సిపల్ కమిషనర్ ప్రోసిడింగ్ పత్రాలపై సంతకాలు చేసి లబ్ధిదారులకు అందించారని గుర్తు చేశారు.
'పేదలకు కేటాయించిన ఇళ్లను వైకాపా కార్యకర్తలకు ఇస్తున్నారు'
గత ప్రభుత్వ హయంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లను..ఇప్పుడు అధికారులు వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ విమర్శించారు. అలా జరిగితే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
'పేదలకు కేటాయించిన ఇళ్లను వైకాపా కార్యకర్తలకుమంజూరు చేస్తున్నారు'
ఇప్పుడు వైకాపా నాయకులకు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని.. అలా జరిగితే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. పేదలకు ఇళ్లు వచ్చే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. అధికారులు తప్పుదోవ పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.