రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. వైకాపా పాలనలో ప్రజా సమస్యల వైఫల్యాలపై పార్టీ నాయకులతో కలిసి శ్రీకాకుళం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం కొవిడ్ మృతుల సంఖ్య బయటకు రాకుండా చేస్తోందన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు. ఏ పేరు పెట్టిన పరవాలేదని పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను తెరిపించాలన్నారు. కుదేలైన రైతాంగాన్ని ఆదుకోవాలన్న తెదేపా నేత.. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని వైకాపా సర్కార్‌ని హెచ్చరించారు.
కొవిడ్ మరణాలు.. వాస్తవాలను ప్రభుత్వం దాస్తోంది: కూన రవికుమార్ - శ్రీకాకుళం ఆర్డీవో వార్తలు
కొవిడ్ మరణాలు.. వాస్తవాలను వైకాపా ప్రభుత్వం దాస్తోందని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. వైకాపా పాలనలో వైఫల్యాలపై శ్రీకాకుళం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు.
![కొవిడ్ మరణాలు.. వాస్తవాలను ప్రభుత్వం దాస్తోంది: కూన రవికుమార్ kuna ravi fires on yscrcp govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12183365-637-12183365-1624030365110.jpg)
kuna ravi fires on yscrcp govt