అమరావతి రైతుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు కూన రవికుమార్ స్పష్టం చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా జిల్లాలోని ఆముదాలవలసలో ఆయన ఆధ్వర్యంలో ఆదివారం తెదేపా శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులు దీక్ష చేపట్టి 300 రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని కూన రవికుమార్ తెలిపారు.
'అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం' - tdp leader koona ravikumar latest news
అమరావతి రైతుల ఆందోళన సోమవారానికి 300 రోజులకు చేరనుంది. ఈ క్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆదివారం సాయంత్రం పార్టీ శ్రేణులు నిరసన దీపాలు వెలిగించాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కూన రవికుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
!['అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం' Koona Ravikumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9138677-12-9138677-1602429131704.jpg)
Koona Ravikumar