ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం మార్గదర్శకంలోనే ఇసుక దందా: కూన రవికుమార్ - కూన రవికుమార్ వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని తెదేపా నేత కూన రవికుమార్ అన్నారు. ఐదు నెలలుగా ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇసుక రవాణా జరుగుతుందని ఆరోపించారు. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన ఇసుకను జిల్లా దాటించారని పేర్కొన్నారు.

koona ravikumar
koona ravikumar

By

Published : Feb 1, 2020, 8:21 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఐదు నెలలుగా సీఎం జగన్ మార్గదర్శకంలోనే ఇసుక మాఫియా నడుస్తోందని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. ఇందులో తమ్మినేని సీతారాం సూత్రధారి అని.... కడప నుంచి వచ్చిన వ్యక్తులు పాత్రధారులని విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన ఇసుకను నిత్యం విశాఖకు తరలిస్తున్నారని అన్నారు. సింగూరు ఇసుక ర్యాంపులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని చెప్పారు. గత 5 నెలల్లో 500 కోట్ల రూపాయల విలువైన శ్రీకాకుళం జిల్లా దాటించారని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

15 లారీలు సీజ్

15 లారీలు సీజ్...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దూసి నాగావళి ఇసుక ర్యాంపు వద్ద పొందూరు మండలం సింగూరు నుంచి ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను శుక్రవారం రాత్రి మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ 15 లారీలను శనివారం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించి సీజ్ చేశారు. లారీ యజమానులపై ఇసుక ర్యాంపు పరిశీలిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని మైన్స్ అధికారులను ఆదేశించారు. లారీలను ఆమదాలవలస పోలీస్ స్టేషన్​కు తరలించాలని ఉన్నతాధికారులు సూచించారు.

మీడియాతో కూన రవికుమార్

ABOUT THE AUTHOR

...view details