ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుత్తుం లక్ష్మణ్‌పై.. మంత్రి అప్పలరాజే దాడి చేయించారు: టీడీపీ నేతలు - Koona Ravikumar fires on minister sidiri

KOONA RAVIKUMAR FIRES ON YCP : వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే చంపడానికి కూడా వెనకాడటం లేదని టీడీపీ నేత కూన రవికుమార్​ ఆరోపించారు. నిన్న వైసీపీ దాడిలో గాయపడిని కుత్తుం లక్ష్మణ్​ని గౌతు శిరీషతో కలిసి ఆయన పరామర్శించారు.

KOONA RAVIKUMAR FIRES ON YCP
KOONA RAVIKUMAR FIRES ON YCP

By

Published : Apr 3, 2023, 7:02 PM IST

కుత్తుం లక్ష్మణ్‌పై.. మంత్రి అప్పలరాజే దాడి చేయించారు

KOONA RAVIKUMAR FIRES ON YCP : శ్రీకాకుళం జిల్లా పలాస మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్​పై.. మంత్రి అప్పలరాజే హత్యాయత్నం చేయించారని.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తే చంపడానికి కూడా వెనకాడడం లేదని ఆక్షేపించారు. కుత్తుమ్ లక్ష్మణ్ భూమి కొనుగోలు చేసి.. ఆ తర్వాత అమ్ముకుంటే అది కబ్జా ఎలా అవుతుందని ప్రశ్నించారు. కుత్తుం లక్ష్మణ్ అదే విషయం విలేకరుల సమావేశంలో చెప్తే.. చంపడానికి ప్రయత్నం చేస్తారా అని మండిపడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుత్తుం లక్ష్మణ్​ని.. గౌతు శిరీషతో కలిసి ఆయన పరామర్శించారు. మంత్రి అప్పలరాజు అరాచకాలపై కూన రవి, గౌతు శిరీష మండిపడ్డారు.

అసలేం జరిగింది: తెలుగుదేశం పార్టీ పలాస మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌పై దాడితో పలాస ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థల వివాదంపై లక్ష్మణ్‌కుమార్‌ నిన్న ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించగా, సాయంత్రం 4గంటల సమయంలో ఆయనపైౖ దాడి జరిగింది. వైసీపీ నాయకులు నర్తు ప్రేమ్‌కుమార్‌తో పాటు కొంతమంది కారుతో ఢీకొని కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో కుడి కాలు విరిగిపోయింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విషయం తెలుసుకుని బాధితుడిని 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు వివరాలు సేకరించారు.

ఆసుపత్రికి టీడీపీ శ్రేణులు..:దాడి విషయం తెలియడంతో టీడీపీ నాయకులు పలాస ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధితుడు లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మంత్రి తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ విసిరిన 5 గంటల్లోనే తనపై దాడి చేయించారని అన్నారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష డిమాండ్‌ చేశారు.

దమ్ముంటే నిరూపించండి:పలాస మండలం గురుదాసుపురం పంచాయతీ రామకృష్ణాపురం పరిధిలో తాను రెండెకరాల భూమి కబ్జా చేసి, అందులో ఇళ్ల స్థలాలు వేసి అమ్మేసినట్లు మంత్రి అప్పలరాజు ఆరోపించారని.. దానిని నిరూపిస్తే తాను టీడీపీ మండల అధ్యక్ష పదవికి, భార్య రూపావతి సర్పంచి పదవికి రాజీనామా చేస్తామని కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు. నిరూపించలేకపోతే మంత్రి అప్పలరాజు తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారాలంటూ వైసీపీ నేతలు తనను సంప్రదించారని, తాను నిరాకరించడంతో తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు.

ఫిర్యాదు చేసేందుకు వస్తే అవమానిస్తారా..దాడి విషయాన్ని కాశీబుగ్గ డీఎస్పీ కె.శివరామిరెడ్డికి ఫోన్‌ ద్వారా వివరించేందుకు మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ పలాస ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో టీడీపీ నాయకులతో కలసి డీఎస్పీని కలిసేందుకు వెళ్లారు. కార్యాలయం లోపలకు ఇద్దరే రావాలని చెప్పడం, లోపలకి వెళ్లగా తలుపులు వేసేయాలని డీఎస్పీ అనడంతో.. ఫిర్యాదు చేసేందుకు వస్తే తలుపులు వేసి అవమానించాలని చూస్తారా అంటూ డీఎస్పీతో మాట్లాడకుండానే గౌతు శివాజీ వెనుదిరిగారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details