'కనీస వస్తువులు అందించటంలో అలసత్వం వద్దు'
కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు, హ్యాండ్ వాష్‌లు పంపిణీ చేయకపోవటంతో ప్రజలు తీవ్ర ఆందోళకను గురవుతున్నారని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తెదేపా కార్యాలయంలో ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాస్కులు, హ్యాండ్ వాష్, బ్లీచింగ్, ఫినాయిల్ పంపిణీ చేయడంలో అలసత్వం వహిస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. వాటిని పంపిణీ చేయకపోవటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇటీవల జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ నివాస్ సర్వజన ఆసుపత్రికి వెళ్లారని..వారిద్దరు తప్ప మరెవరికీ మాస్కులు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచిందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆసుపత్రులకి కనీస వస్తువులు అందించాలని... అవసరమైన ద్రావణాన్ని పంపిణీ చేయాలని కోరారు.