ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 5, 2020, 11:06 AM IST

ETV Bharat / state

వ్యవసాయ బావిలో కొండచిలువ.. పట్టుకున్న అధికారులు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్టలో వ్యవసాయ బావిలో కొండచిలువను గుర్తించారు. ఈ విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ జంతు సంరక్షణ గస్తీ విభాగానికి, అటవీ శాఖకి తెలియజేశారు. అధికారులు ఆ పాముని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

kondachiluva in well at srikakulam district
kondachiluva in well at srikakulam district

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట సమీప వ్యవసాయ బావిలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. కొండచిలువను గ్రామస్థులు గుర్తించి... ఈ విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ జంతు సంరక్షణ గస్తీ విభాగానికి, అటవీ శాఖకి తెలియజేశారు. గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం, అటవీశాఖ సిబ్బందితో కలసి అక్కడకు చేరుకున్నారు. గ్రీన్ మెర్సీ సంస్థ ప్రతినిధి రమణమూర్తి చాకచక్యంగా ఆ పాముని బావి నుంచి బయటకు తీశారు.

అనంతరం గ్రామస్థులకు పాములపై రమణమూర్తి అవగాహన కల్పించారు. పాములను కాపాడవలసిన ఆవశ్యకత వివరించారు. అనంతరం ఆ పాముని జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. డీఎఫ్ఓ సందీప్ కృపాకర్ సూచన మేరకు ఆ పాముని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

ఇదీ చదవండి: చికిత్సకు వెళ్లడంలో జాప్యంతోనే కొవిడ్ మరణాలు!

ABOUT THE AUTHOR

...view details