గాంధీయన్ ఛాలెంజ్...
యునిసెఫ్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబరు నెలలో గాంధీయన్ ఛాలెంజ్ పేరుతో విజ్ఞానం, ఆవిష్కరణలతోపాటు కళలపై పోటీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న 3 వేల పాఠశాలలకు గాంధీజీ ప్రబోధించిన సిద్ధాంతాలపై ఈ పోటీలు జరిగాయి. 3,800 ఆవిష్కరణలు పోటీల్లో పాల్గొనగా... 50 ఉత్తమమైనవి ఎంపిక చేశారు. శ్రీకాకుళం జిల్లా కొల్లివలస బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థి తయారు చేసిన ప్రాజెక్టుకు ప్రథమ స్థానం లభించింది.
ఈ ప్రాజెక్టు తయారీలో తొమ్మిదో తరగతి విద్యార్థి క్రాంతిభూషణ్ ప్రధాన భూమిక పోషించగా... తోటి విద్యార్థులు చంద్రశేఖర్, సందీప్‌కుమార్ సహకరించారు. ఈ ప్రాజెక్టుకు ఉపాధ్యాయుడు త్రినాథరావు, ఏటీఎల్ శిక్షకుడు శివసంతోష్ చేయూతనిచ్చారు. రోబోటిక్ యంత్రాల సాయంతో తక్కువ వ్యయం, తక్కువ సమయంలో వ్యవసాయ పనులు ముగించుకునేలా చూడటం ఎంకే గాంధీ ఐడియాస్ ఆఫ్ గ్రామ స్వరాజ్ ప్రాజెక్టు తయారీ ముఖ్య ఉద్దేశం.