శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు ఏస్థాయిలో ఉన్నాయో రాష్ట్రమంతా తెలిసిందే. రెండేళ్ల కిందట ఉద్దానంలో 1.03 లక్షల మంది పరీక్షలు చేయించుకోగా 13 వేల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. డయాలసిస్ రోగులకు రూ.10 వేలు, సీకేడీ రోగులకు రూ.5 వేలు పింఛను సదుపాయం కల్పించారు. జిల్లాలో 8 వేలకు పైగా సీకేడీ బాధితులుంటే కేవలం 294 మందికే రూ.5 వేలు పింఛను అందుతోంది. నెఫ్రాలజిస్టు ద్వారా ధ్రువపత్రం పొందడానికి నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్దానం కిడ్నీ రోగులకు అందని సాయం..? - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పింఛను అందక కిడ్నీ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీకేడీ రోగులు జిల్లాలో 8 వేలకు పైగా ఉంటే కేవలం 294 మందికే రూ.5 వేలు పింఛను అందుతోంది.

Kidney patients