శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో కాశీ అన్నపూర్ణా దేవి భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా అమ్మవారికి 100 కిలోల కూరగాయలు, పండ్లను అర్చకులు అలంకరించారు.
ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.