ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం శివాలయాల్లో కార్తీక ఏకాదశి పూజలు - Karthika Ekadashi Pujas news

శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలు కార్తీక శోభతో అలరారుతున్నాయి. ప్రత్యేక పూజలకు, కార్తీక దీపారాధనలకు భక్త జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

Karthika Ekadashi Pujas
కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు

By

Published : Nov 25, 2020, 1:59 PM IST

కార్తీక ఏకాదశి సందర్భంగా... శ్రీకాకుళం జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగావళి, వంశధార నదీ తీరాలు దీపారాధనలతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలను సిబ్బంది సుందరంగా ముస్తాబు చేశారు.

ABOUT THE AUTHOR

...view details