ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమాయక ప్రజలపై ప్రభుత్వమే పోలీసులతో దాడులు చేయిస్తోంది' - ప్రభుత్వంపై రణస్థలంలో కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు

వైకాపా ప్రభుత్వానికి జనం త్వరలోనే చరమగీతం పాడతారని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. అధికార పార్టీ ప్రోద్బలంతో.. పోలీసులే ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో పంచాయతీ ఎన్నికల అనంతరం ఘర్షణల వల్ల పాడైన ఇళ్లు, వాహనాలను ఆయన పరిశీలించారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

kala venkatrao met with ranastalam tdp men came on bail
రణస్థలం ఘర్షణల్లో బెయిల్​పై విడుదలైన తెదేపా కార్యకర్తలను పరామర్శించిన కళా వెంకట్రావు

By

Published : Mar 4, 2021, 6:58 AM IST

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో పంచాయతీ ఎన్నికల విషయంలో జరిగిన ఘర్షణల వల్ల.. మాజీ సర్పంచ్ చిల్లా శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్​పైన విడుదలైన వారిని కళా వెంకట్రావు పరామర్శించారు. దాడుల్లో పాడైన సామగ్రితో పాటు పలువురి ఇళ్లలో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను పరిశీలించారు. ఘర్షణలో దెబ్బతిన్న కారు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను భాదితులు ఆయనకు చూపించారు.

ప్రజలకు, కార్యకర్తలకు తెదేపా అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమాయక ప్రజలపై వైకాపా ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని.. కళావెంకట్రావు ఆరోపించారు. అధికార పార్టీతో సహా పోలీసులూ తగిన మూల్యం చెల్లిచుకోక తప్పదన్నారు. దుర్మార్గ, నిరంకుశ పాలనకు విసుగు చెందిన జనం.. ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. త్వరలోనే వైకాపాకు ప్రజలు విశ్రాంతిని ఇస్తారని అభిప్రాయపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details