ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది: కళా వెంకట్రావు - Kala Venkatrao comments on Jagan

వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్​పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. అన్ని వ్యవస్థలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆయన మాట్లాడారు.

కళా వెంకట్రావు
కళా వెంకట్రావు

By

Published : Mar 2, 2021, 7:30 PM IST

కళా వెంకట్రావు

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు బలవంతపు ఎన్నికలని అభివర్ణించారు. ప్రశ్నించే వారిపై కేసు నమోదు చేస్తున్నారని, అన్ని వ్యవస్థలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదని... రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ రాజకీయ జీవితంంలో ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశామని... ఇటువంటి సీఎంను చూడలేదన్నారు. ప్రజాకోర్టులో ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ... కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్

ABOUT THE AUTHOR

...view details