ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే కేసులా..?' - తెదేపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వార్తలు

తెదేపా నేతల అరెస్టులకు నిరసనగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆందోళనకు దిగారు. వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిపై కక్షగట్టారని ఆరోపించారు.

kala venkatrao
kala venkatrao

By

Published : Jun 13, 2020, 3:10 PM IST

తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ.. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆందోళన చేపట్టారు. వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తెదేపా నేతలను అరెస్టు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిపై కక్షగట్టి, ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారు. దానికి తోడు అక్రమ అరెస్టులు, విజిలెన్స్ దాడులు చేయడం సరికాదు. పోలీసు వ్యవస్థను చేతులో పెట్టుకుని ప్రజలను భయపెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇటువంటి చర్యలు రాబోయే తరానికి మంచిది కాదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తెదేపా నేతలుగా.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఆగ్రహంలో కొట్టుకు పోతుంది.

-కళా వెంకట్రావు , తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details