రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెదేపా నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే వారిపై, ప్రజా సమస్యలను గుర్తించి నిలదీసే వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. రామతీర్థం ఘటన జరిగి నెల గడుస్తున్నా...ఇంత వరకు చర్యలు చేపట్టలేదని ఆక్షేపించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం తగదని హెచ్చరించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా ?: కళా
రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని..,ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం తగదని హెచ్చరించారు.
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా ?
వైకాపా దుర్మార్గాలతో చట్టం తనపని తాను చేసుకోలేకపోతుందన్నారు. జగన్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై కూడా దాడి చేస్తోందని మండిపడ్డారు. అమెరికాలో ట్రంప్‌కు ఎంత వ్యతిరేకతో ఉందో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి కూడా అంతే ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఇదీచదవండి: కళా అరెస్టుపై ఆగ్రహ జ్వాలలు... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు