వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ నివాస్ ప్రారంభ కార్యక్రమాన్ని తిలకించారు.
'ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తాం'
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తామని మంత్రి ధర్నాన కృష్ణదాస్ పేర్కొన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు... వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టినట్టు మంత్రి వివరించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల నేరవేరుస్తాం
కాపు నేస్తం పథకం క్రింద శ్రీకాకుళం జిల్లాలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 4239 మంది మహిళలకు ప్రయోజనం కలిగిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ వివరించారు. 6 కోట్ల 36 లక్షల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ అయ్యాయని పేర్కొన్నారు.
ఇది చదవండి 'వైఎస్ఆర్ కాపు నేస్తాన్ని' ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్
Last Updated : Jun 25, 2020, 6:29 AM IST