Justice Battu Devanand: న్యాయమూర్తులు ఎవరికీ భయపడకుండా రాజ్యాంగ విలువలు కాపాడేలా నిష్పాక్షికంగా తీర్పులివ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. న్యాయవాదుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన జస్టిస్ తర్లాడ రాజశేఖరరావును శనివారం స్థానిక జిల్లా బార్ అసోసియేషన్ సన్మానించింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడారు. ‘రెండేళ్ల నాలుగు నెలలుగా నేను న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నాను. ప్రతిక్షణం రాజ్యాంగానికి కట్టుబడి సేవలందిస్తున్నా. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భూమి పుత్రుడు జస్టిస్ రాజశేఖరరావు కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు.
పక్షపాతం లేకుండా తీర్పు ఇవ్వాలి: జస్టిస్ బట్టు దేవానంద్ - శ్రీకాకుళంలో జిల్లా బార్ అసోసియేషన్ సమావేశం
Justice Battu Devanand: న్యాయమూర్తులు ఎవరికీ భయపడకుండా రాజ్యాంగ విలువలు కాపాడేలా నిష్పాక్షికంగా తీర్పులివ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. శ్రీకాకుళంలో జిల్లా బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా బార్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న జస్టిస్ బట్టు దేవానంద్