శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణ శివారులో ఉన్న తమ కళాశాల వరకు బస్సులు నడపాలని జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కళాశాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సకాలంలో కళాశాలకు చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల సమీపంలోనే ఆర్టీసీ డిపో ఉండడంతో అక్కడివరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కల్పించాలంటూ..విద్యార్థుల ధర్నా! - palakonda
శ్రీకాకుళం జిల్లా పాలకొండ జూనియర్ కళాశాల ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేపట్టారు. కళాశాల వరకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
junior college students doing dharna about bus facilities in palakonda at srikakulam district