JSP Yuvashakti Sabha: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం సుభద్రపురం వద్ద ఈనెల 12న పవన్ కళ్యాణ్ నిర్వహించే యువశక్తి సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని.. యువత కష్టాలను తెలుసుకొని భరోసా కల్పించడానికి యువశక్తి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపడుతున్నారని అన్నారు. అడ్డగోలు చట్టాలతో ప్రజలను భయపెట్టి, ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర నుంచి పెద్దఎత్తున యువత ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు తరలిపోవడం భాదకరం అఁటున్న నాదెండ్ల మనోహార్ తో మా ప్రతినిధి ముఖాముఖి..
శ్రీకాకుళం యువశక్తి సభ ద్వారా నిరుద్యోగులకు భరోసా!: జనసేన నేత నాదెండ్ల మనోహర్ - Srikakulam Latest News
Yuvashakti Sabha: శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తున్న యువశక్తి సభ ఏర్పాట్లను జనసేన నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఈ సభ ద్వారా పవన్ కల్యాణ్ భరోసా కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర నుంచి పెద్దఎత్తున యువత ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువశక్తి సభతో నిరుద్యోగులకు భరోసా