JC Fire on Millers: మిల్లర్లపై శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ విజయ్ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రం నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకునేందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయా అంటూ ప్రశ్నించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే రైతు భరోసా కేంద్రంలో ధాన్యాన్ని పరీక్షించిన అనంతరం పంపిస్తుంటే.. మిల్లర్లు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.
పాలకొండలోని సత్యనారాయణ రైస్‌మిల్ రైతులనుంచి ధాన్యాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. దీనిపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి లెక్కల చూపాలని ఆదేశించారు. మిల్లర్ల వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడంతో మండిపడ్డారు. ఇకనుంచి రైతు భరోసా కేంద్రం నుంచి వచ్చిన ధాన్యాన్ని ఖచ్చితంగా తీసుకుంటామని లిఖితపూర్వకంగా అంగీకారపత్రం తీసుకున్నారు.