కరోనా నివారణ చర్యలపై జేసీ సుమిత్ కుమార్ ఆరా - corona updates at srikakulam
కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై శ్రీకాకుళం జిల్లా జేసీ సుమిత్ కుమార్ రణస్థలం మండలం పైడి భీమవరం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించారు. అనంతరం వలస కార్మికులతో మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడి భీమవరం వద్ద ఉన్న చెక్ పోస్టును జేసీ సుమిత్ కుమార్ తనిఖీ చేశారు. కరోనా కట్టాడికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వలస కార్మికులతో మాట్లాడారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు పంపించాలని సూచించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. వలస కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.