టీ జొన్నవలస సచివాలయ సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని పనితీరు మార్చుకోవాలని జేసీ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను జేసీ పరిశీలించారు. సచివాలయ సర్వీసులు రోజుకు 10 చేయాలని ఆదేశించారు. సేవల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు ఉంటాయని సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు.
సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి: జేసీ - సచివాలయ సిబ్బందిపై జేసీ శ్రీనివాసులు కామెంట్స్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం టీ జొన్నవలస గ్రామంలో ఉన్న సచివాలయాన్ని జేసీ డాక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి: జేసీ