ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్తర సిక్కింలో శ్రీకాకుళం జవాన్ మృతి - జవాన్​ మృతి

ఉత్తర సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాకుళానికి చెందిన జవాన్​ వంజరాపు రామారావు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన నడుపుతున్న వాహనం లోయలో పడటంతో.... సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

srikakulam jawan dead in sikkim
మంచు వల్ల లోయలో వాహనం పడిన ఘటనలో జవాన్​ మృతి

By

Published : Mar 2, 2021, 11:40 PM IST

శ్రీకాకుళం ఇల్లీసుపురానికి చెందిన ఆర్మీ జవాన్‌ వంజరాపు రామారావు ప్రమాదవశాత్తు ఉత్తర సిక్కింలో మృతి చెందారు. రామారావు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మంచు కారణంగా...ఆయన నడుపుతున్న వాహనం ఒక్కసారిగా లోయలోకి పడిపోయింది.

సోమవారం ఘటన జరిగినప్పటికీ.. మృతదేహాలను ఆర్మీ సిబ్బంది మంగళవారం వెలికితీశారు. దీంతో సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు.

ABOUT THE AUTHOR

...view details