jawad cyclone effect: జవాద్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం మారడం వల్ల జిల్లావాసులు చలితో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా.. మడ్డువలస జలాశయం నుంచి నాగావళి నదిలోకి వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అప్రమత్తంగా ఉండాలి..
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు.. ప్రత్యేక అధికారి అరుణ్ కుమార్తో కలిసి కలెక్టర్ సమీక్షిస్తున్నారు.