శ్రీకాకుళం అంతా జనతా కర్ఫ్యూతో నిర్మానుషంగా మారింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు ఖాళీగా ఉన్నాయి. ఏడు రోడ్ల కూడలి, డే అండ్ నైట్ కూడలి, పొట్టి శ్రీరాముల కూడళ్లలో సిక్కోలు వాసులు కర్ఫ్యూను విజయవంతంగా నిర్వహించారు. బస్ స్టాండ్లలో, డిపోల వద్ద బస్సులను నిలిపివేశారు. అలాగే వాణిజ్య సముదాయాలు తెరచుకోలేదు.
శ్రీకాకుళంలో జనతా కర్ఫ్యూ - janata curfew in srikakulam latest news
నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళంలోని పలు ప్రదేశాలు జనతా కర్ఫ్యూతో ఖాళీగా మారాయి. షాపులు, రెస్టారెంట్లు, లాడ్జీలు అన్నీ మూతబడ్డాయి. ప్రజలంతా గృహాలకే పరిమితమయ్యారు.

జనతా కర్ఫ్యూలో శ్రీకాకుళం విజయవంతం
TAGGED:
srikakulam town latest news