శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో... జగనన్న విద్యా కానుక కిట్లను స్థానిక వైకాపా నేతలు, పాఠశాల ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. లక్ష్మీ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మెట్టవలస మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో... రాష్ట్ర వైకాపా యువజన విభాగ కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి కిట్లు పంపిణీ చేశారు.
వైకాపా నేతల చేతుల మీదుగా జగనన్న విద్యాదీవెన కిట్లు పంపిణీ - శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన జగనన్న విద్యాదీవెన పథకం కిట్లను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, ఇచ్చాపురంలో స్థానిక వైకాపా నేతలు పంపిణీ చేశారు.
వైకాపా నేతల చేతుల మీదుగా జగనన్న విద్యాదీవెన కిట్లు పంపిణీ
ఇచ్చాపురంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని డీసీఎంఎస్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే, వైకాపా ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ప్రారంభించారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందించారు.
ఇదీచదవండి.