ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఎచ్చెర్ల శాసనసభ్యుడు గొర్లె కిరణ్ కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రణస్థలం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన వెయ్యి మంది మత్స్యకారులు, బోటు యజమానులకు సోలార్ దీపాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారి వై.సత్యనారాయణ, జిల్లా మత్స్యకార సహకార సంఘం నాయకులు కోనాడ నరసింగరావు, ఎచ్చెర్ల, రణస్థలం మండలాలకు చెందిన మత్స్యసహకార సంఘం నేతలు పాల్గొన్నారు.
గంగపుత్రులకు సోలార్ దీపాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కిరణ్ - Solar lamps to Gangaputhras
వైకాపా సర్కార్ గంగపుత్రుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎచ్చెర్ల శాసనసభ్యుడు గొర్లె కిరణ్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మత్స్యకారులకు సోలార్ దీపాలను అందజేశారు.
గంగపుత్రులకు సోలార్ దీపాలను పంపిణీ చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్