ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నమ్మవద్దు: పీవో శ్రీధర్ - srikakulam latest news

శ్రీకాకుళం గిరిజన యువత శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారన్న వార్తలపై ఐటీడీఏ పీవో శ్రీధర్ స్పందించారు. ప్రస్తుతం వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ITDA PO sridhar respond on students got corona positive
సీతంపేట ఐటీడీఏ పీవో శ్రీధర్

By

Published : Jun 16, 2021, 9:14 AM IST

శ్రీకాకుళం గిరిజన యువత శిక్షణ కేంద్రంలో విద్యార్ధులందరూ క్షేమంగానే ఉన్నారని సీతంపేట ఐటీడీఏ పీవో శ్రీధర్ తెలిపారు. ఐఐటీ శిక్షణ పొందుతున్నవిద్యార్ధులు... కొవిడ్ బారిన పడిన సంఘటనపై స్పందించిన పీవో శ్రీధర్... విద్యార్థులందరికీ పౌష్ఠికాహారం అందిస్తూ వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.

స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థుల్లో 28 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు పీవో వెల్లడించారు. ప్రస్తుతం వారందరూ కొవిడ్ కేర్ సెంటర్‌లో ఉంటున్నారన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దన్న పీవో శ్రీధర్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details