ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లు, పాన్​ మసాలా పట్టివేత.. విలువ ఎంతంటే..!

By

Published : Nov 3, 2022, 7:49 PM IST

Smuggling of tobacco products: శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 37 లక్షల విలువైన సిగరెట్లు, పాన్ మసాలా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి విశాఖపట్నంకు ఓ కంటైనర్​లో రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు.

tobacco products
పొగాకు ఉత్పత్తులు

Smuggling of tobaccos productas: శ్రీకాకుళం జిల్లాలో అధికారుల కళ్ళు కప్పి దొడ్డిదారిన అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు నరసన్నపేట మండలం మడపం టోల్​గేటు వద్ద ఓ కంటైనర్​లో భారీ ఎత్తున సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. విజయనగరం పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కె. రఘునాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి విశాఖపట్నంకు ఓ కంటైనర్​లో అక్రమంగా సరకు రవాణా చేస్తున్నారని తెలిపారు. రూ. 37 లక్షల విలువైన సిగరెట్లు, పాన్ మసాలా ప్యాకెట్లను మడపం టోల్​గేటు వద్ద పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

భారీ మొత్తంలో సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు తరలిస్తున్నారని.. అయితే వీటిని ఎవరు రవాణా చేస్తున్నారన్నది ఇంకా గుర్తించలేదని తెలిపారు. వాహనం డ్రైవర్​ను ప్రశ్నిస్తున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. కాగా గత నెల 27న విజయనగరం జిల్లా బొబ్బిలిలో సైతం రైలు మార్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు పట్టుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details