ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే..ప్రజల స్వేచ్ఛను హరిస్తోంది' - స్థానికసంస్ఖల ఎన్నికలపై కళా వెంకట్రావు కామెంట్స్

వైకాపా ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాలను సిక్కోలు వరకు వ్యాపించేలా చేసిందని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే... ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని ఆక్షేపించారు.

తెదేపా నేత కళా వెంకట్రావు
తెదేపా నేత కళా వెంకట్రావు

By

Published : Mar 12, 2020, 7:26 PM IST

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే.. ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాలను సిక్కోలు వరకు వ్యాపించేలా చేసిందని మండిపడ్డారు. బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. ప్రభుత్వం ఇటువంటి దారుణాలు చేస్తూ.. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. మద్యంపై ఉన్న దృష్టి చిన్నాన్న వివేకా హత్యకేసుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. వివేకా హత్యకేసును సీబీఐతో విచారణ జరపాలని కోరిన జగన్.. ఇప్పుడు ఎందుకు వెనకడుగువేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details