శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని అధికారులు విడిచిపెట్టారు. ఖరీఫ్ పంట పనుల కోసం 460 క్యూసెక్కుల చొప్పున ఇరు కాల్వలకు అధికారులు నీటిని విడుదల చేశారు. సుమారు 37 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారి గనిరాజు తెలిపారు. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 8 వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినట్లు చెప్పారు.
నారాయణపురం ఆనకట్ట నుంచి సాగునీరు విడుదల - నారాయణపురం ఆనకట్ట తాజా వార్తలు
రంగరాయపురం వద్ద నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని అధికారులు విడిచిపెట్టారు. దీని ద్వారా ఖరీఫ్‌లో 37 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటి పారుదల శాఖ అధికారి గనిరాజు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
నారాయణపురం ఆనకట్ట నుంచి సాగునీరు విడుదల